Adsense

Wednesday, April 24, 2024

Tuesday, April 23, 2024

శ్రీ రామ దూత స్తోత్రం

.
శ్రీ రామ దూత స్తోత్రం


రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష దంష్ట్రా కరాళం
రం రం రం రమ్య తేజం గిరి చలన కరం కీర్తి పంచాది వక్త్రం
రం రం రం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళ భేద్యం
రం రం రం రాక్షసాంతం సకల దిశ యశం రామదూతం నమామి!

ఖం ఖం ఖం ఖడ్గ హస్తం విష జ్వర హరణం వేద వేదాంగ దీపం
ఖం ఖం ఖం ఖడ్గ రూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయమాయా స్వరూపం
ఖం ఖం ఖం కాల చక్రం సకల దిశ యశం రామదూతం నమామి!

ఇం ఇం ఇం ఇంద్ర వంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్య లాభం
ఇం ఇం ఇం సిద్ధి యోగం నతజన సదయం ఆర్య పూజ్యార్చితాంగం
ఇం ఇం ఇం సింహ నాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకల దిశ యశం రామదూతం నమామి!

సం సం సం సాక్షి భూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్య గీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్య తత్వ స్వరూపం
సం సం సం సావధానం సకల దిశ యశం రామ దూతం నమామి!

హం హం హం హంస రూపం స్ఫుట వికట ముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశి నయనం రమ్య గంభీర భీమం
హం హం హం అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వ రోమం కరాళం
హం హం హం హంస హంసం సకల దిశ యశం రామ దూతం నమామి!

Monday, April 22, 2024

చెన్న పురి చంద్ర కలా:, చంద్రకాంతలు: మాల్ పూరీ, రవ్వ సేమియా యిడ్లి :ఎలా తయారు చేయాలి?

చెన్న పురి  చంద్ర కలా: మాల్ పూరీ: 

గోధుమపిండి స్వంతముగ దయారు చేసినదియైన మిక్కిలి శ్రేష్ఠము. ఆంగడులలో దొరకునది అంత శ్రేష్టమైనది కాజాలదు. అంత రుచికరముగను వుండ జాలను. కావున మంచి గోధుములను దెచ్చి పిండి చేసి పూరీలవలె అప్పడములుగా తయారుకేసి. పంచదార, తీయదోస విత్తులు, బాదంపప్పు, ద్రాక్షపండ్లు, క పప్పు, కిస్తాపప్పు, ముంతమామిడిపప్పు, వీటినన్నిటిని సూరి, కొంచెముతీసి తయారుజేసిన అప్పడములోబెట్టి పైన దానితో నే మూతమూసి నేతిలో వేపి వుపయో గింపవలెను. మిక్కిలి రుచిగానుండును.
మాల్ పూరీ:

ఆరవీ సె మైదాపిండితెచ్చి ఒక పాత్రలో వేసి దానిలో కొంచెము మిఠాయిరంగువేసి నీళ్లతో చ్కొగా కలుపపలెను. కొంచెము సోడాగుండ, ఏలకులపొడి దానిలో కలుపపలెను. పొయ్యిమీద జిలేబీకళాయి (లోతులేనికధాయి) పెట్టి దానిలో నెయ్యి పోసి సలసల మరిగిన తరువాత చిక్కగా కలిపిన మైదాపిండి గరిటెతోతీసి అట్టుమాదిరిగా పోయవలయును. (మామూలు లోతుకళాయి ఉప యోగించిన పూరీ ముద్దకట్టి పాడగుకు పూరీ ఎల్లం గా వేగనీయవలయును. ఇ తకుముందు ఒక ఆరవీ సె పంచదార లేతపాకముపట్టి ఉంచుకోవలెను. వేగిన పూరీలను ఈపాకములో వేయపలయంను. తరు వాత వానినితీసి రెండు చట్రముల మధ్య పెట్టి అరి®లు నొక్కుట్లు నొక్కవలెను. ఆదియే తినుటకు సిద్ధ ముగానున్న మాల్ పూరీ. 

చంద్రకాంతలు:

మొట్టమొదట పెసరపప్పు నానవైచి పప్పువానిన తదుపరి రోటియందుబోసి మెత్తగా రుబ్బవలయు మెత్తగా మెదిగినపిండి గిన్నెలోనికితీయవలయును. అది అటులుఁడనిచ్చి మఱియొకగిన్నెలో బెల్లము మెత్తగా తరిగిపోసి ఆబెల్లముపైన ఉబ్బిన పిండిముద్ద ఉంచి పొయ్యిమీద పెట్టవలయును. పిండియు బెల్లము కలిసి కుతకుత ఉడుకుతూ ఉన్న సమయాన గరిటెతో కలుపుతూ ఉండవలయును. అప్పుడు పాకములాగ గట్టిపడును. తరువాత నున్ననిపీటకి నేయివ్రాసి ఆపిండి పీట పెవేసి సమానముగా చేయవలయును. అది చెల్లబడినచో చిన్నముక్కలుగా కోయవలెను, ఆకోసి ముక్కలను మసమస కాగుచున్న నూనెలో గాని, నేతిలోగాని వేసి కొంచెముగా ఉడికించినచో ఎఱ్ఱరంగువచ్చును. వీనినే చంద్రకాందెలు అందుడ. ఇవి తినుటకు చాల రుచికరము.

రవ్వ సేమియా ఇడ్లి :

గోధుమరవ్వలో పెరుగుబోసి గరిటజారుగాక లిపి కొంచెము నానబెట్టవలెను. ఇందు సీమియా ను వేయించి కలుపునది —
పిమ్మట ఇడ్డెను పాత్రలో ఇడ్లిమాదిరిగానే గుంట లలో ఆపిండింపోన్, ఆవిరిమీద ఉడికినపిదప దించు కొనునది -

ఇడ్లి పచ్చడి 

శనగపిండిలో పెరుగు పలుచగాకలిపి తాలింపు పెట్టి, ఉప్పు కలుపునది— ఈపచ్చడితో, ఇడ్లిలో కోయివేసికొని భుజింప రుచికరము,




వంకాయ సివంగిపులుసు, వంకాయ సోమాసీ: ఎలా చేయాలి?

వంకాయ సివంగిపులుసు

లేతవంకాయలు అన్నీ ఒక్క మాదిరిగానున్నవి కొని నాలుగు చీలికలుగా తరిగివుంచవలెను. పిమ్మట జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు, మెంతులు, మినప్పప్పు కొద్దిగా దోరగా వేయించవలెను. ఉప్పువేసి పైన చెప్పినవి కలిపి మెత్తగా దంచి గుండచేసియుంచి దానిలో అల్లం చిన్నముక్కలు తరిగి కలిపి ఆగుండను సంకాయలలో బాగా కూరవలెను. పిమ్మట కొంచెం ను ల కపువ్వు వేయించి గుండకొట్టి ఉంచవలెను. తరువాత మనకు కావలసినమట్టుకు పులుసు అనగా చింతపండుది పైన చెప్పిన వంకాయలను సదలివేయవలెను, కొద్దిగా మంట బాగా పెట్టవలెను. మొదట పులుసు తిరగబో పొయ్యిమీద ఉంచి బాగాకాగుతుండగా అందులో ఎయ్యవలెను. తరువాత కాయలు మెత్తగా ఉడికేవరకు ""నేపొయ్యవలెను. తరువాత కాయముచిక పట్టుకొన్న తేనెపట్టువలె కదిలీటట్టుఉండవలెను. పైన చెప్పిన నువ్వులపొడి వేసిదింపి వేడిచల్లారకుండ భుజించవలెను,
వంకాయ సోమాసీ: 

గోధుమలు బాగ మెత్తటి పిండివిసరి గట్టిగాతడపవలెను. తడుపునపుడు పిండికనరుకాకుండ కొద్దిగా ఉప్పునూర్ కలపవలెను. చాలగట్టిగా తడిపి పెట్టవలెను. మంచి కేతవంకాయలు, యెర్రగడ్డలు, పచ్చిమిరప కాయలు, కొత్తిమిరిఆకు, కరివేపాకు బాగా కడిగి పెట్టవలెను. వంకాయలు ముచికలుతీసి నాల్గుపక్షముగా తరిగి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమిరికూడ తరిగివుంచవలెను. ఉప్పుకొంచెము పసుపు నూనె ఆఅన్ని బద్దలకు బాగా పట్టించి సన్నటిశగమీద (ఆడుగున) ఒకగిన్నెలో నీళ్లుకొంచెము నూనెకొంచెము(చాల కొంచెం)వేసి ఉప్పురాసిన బద్దలు అందులో వేసి బాగా కుదిలించి పైన ఒక పళ్లెములో నీళ్లుపోసి ఉంచవలెను. పదినిమిషములు ఆయినతరువాత బాగా కుదిపి వంకాయలు ఎర్రగడ్డలు మెత్తపడినది లేనిది చూడవలెను. బాగా ఉడికినదాక అపుడపుడు కలుపుతు గరిటతో గాని కుదిలించిగాని కొంచెము శనగపిండి, కొద్దిగా బియ్యపుపిండి పైన చల్లవలెను. పిండిచల్లకపోతే కూర ఎర్రగడ్డలు వేరే సంకాయవేరే ఉండును. ఇపుడు ముద్దగా ఉండును, ఉడకగానే బాగా ఆర బెట్టి వుంచవలెను. గోధుమపిండికి కొంచెము నెయ్యిపట్టించి బాగా చేతికొద్ది మర్దన చేయవలెను. తరువాత కొంచెములావుగా పూరీపత్తి ఈవంకాయకూర (కజ్జికాయలకు కొబ్బెరపూర్ణము పెట్టి మడిచినట్లుగానే) ఈపూరీకికూడ కూర పెట్టిమడిచి వెంటనే చమురులో వేచవలెను. పూరీలు చేసుకొను టకుముందే చమురు బాగా కాగుతూఉండవలెను. పూరీలో కూర పెట్టినతరువాత తిరిగి పీటమీద పెట్టి నూనె కాగినదాక ఉండనిచ్చిన నీళ్లుకారి పూరీ పీటకు కరుచుకొనిపోవును. పూరి కూర పెట్టినవెంబడే చమురులో కాల్చవలెను. బహురుచి గా ఉండును.

రజస్వల విశేషాలు... ఏ దేశంలో ఏ వయసులో రజస్వల అవుతారు? కారణం ఏమిటీ? Menstruation features... In which country at what age do you menstruate? What is the reason?


Wednesday, April 17, 2024

రామనామం' విశిష్టత

' రామనామం'

గుణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం,  అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు!  ప్రతి లక్షణం కొద్దికొద్దిగా కలిసి ఉండటమూ అరుదు!  ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతమూ సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అన్నీ పరిపూర్ణంగా ఉండే ఒక అద్భుతం జరగాలంటే, ఆ దేవుడే దిగి రావాలి!  అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు!

పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది.

అత్యంత ప్రాచీనమైన రామాయణాన్ని పరిశీలిస్తే, ఆనాటి మానవ సమాజం నాగరికంగా ఎంత ఎదిగిందో అవగతమవుతుంది. గ్రామ, జానపద, నగర ఆవాసాలు, పరిపాలనా పద్ధతులు, మానవ సంబంధాల మర్యాదలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. వాగ్ధోరణిలో ఔచిత్యాలు, ప్రవర్తన సరళిలో సంస్కారాలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు, కళారీతులు లాంటివన్నీ అభ్యుదయ స్థితిలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

అలాంటి కాలంలో మహా వ్యక్తిత్వంతో రఘురాముడు రాజిల్లాడు. అద్భుత పరిపూర్ణ వ్యక్తిత్వం వల్ల, ఆయనను భగవంతుడిగా కొలుస్తామంటారు కొందరు. భగవంతుడే ఒక నిండైన మహా వ్యక్తిగా అవతరించి, లోకానికి ఆరాధ్యుడయ్యాడని ఇంకొందరు చెబుతారు. ఈ రెండో అంశమే వాల్మీకాది మహర్షుల హృదయం.

ఆదర్శమూర్తి అయిన రాముడు నారాయణుడి అవతారంగా ఎందరికో ఆరాధ్యుడు. రావణాది రాక్షసుల వల్ల సడలిన ధర్మవ్యవస్థను చక్కదిద్దడానికి రుషులు, దేవతలు ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మను ఉపాసించారు. జగతికి ఆనందం కలిగించడానికి ఆ పరమాత్మను మంత్రం, తపస్సు, సాధనలతో ఆరాధించారు. వాటి ఫలంగా భగవంతుడు రాముడిగా అవతరించాడు!

రామారాధన అంటే, అది సాక్షాత్తు పరబ్రహ్మోపాసన. దీనికి తార్కాణంగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భిన్న భాషల్లో భిన్న రీతుల్లో పలువురు భక్తులు, యోగులు సాక్షాత్కరిస్తారు. తులసీదాసు, రామదాసు, కబీరు, త్యాగయ్య యింకా  ఎందరో!

    శ్రీరాముని పుట్టుక సమయంలో గ్రహబలం!

రామ జనన గాథలోనే విశేషం ఉంది! దాన్ని దేవ రహస్యం అనవచ్చు. రాముడు చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు. అయిదు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా, అదితీనక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది.

ధర్మనిష్ఠులను, సామాన్యులను, ఆశ్రయించిన అభాగ్యులను ఆదు కోవడం రాముడి వైశిష్ట్యం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేవారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా సందర్భోచితంగా కారుణ్య, కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత.

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు అంటే  గట్టి నియమ పాలన గలవాడు శ్రీరాముడు. ఆయన మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, చూసేవారికి ప్రీతి కలిగించే స్వరూప స్వభావాలున్నవాడు. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్వి, అసూయ లేనివాడు, ధర్మబద్ధమైన తన ఆగ్రహంతో దేవతల్ని సైతం శాసించగలిగేవాడు రాముడు. ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో, సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ!

భారతజాతి గుండె చప్పుడుగా 'రామనామం' మోగుతూనే ఉంది. ఆస్తిక జన హృదయాల్లో ఆయన దివ్యమంగళ విగ్రహం కొలువై ఉంది. రామ కథా సుధ తరగని జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది!

భగవత్బందు మిత్రులందరికీ   శ్రీరామనవమి శుభాకాంక్షలు!    

అంతా రామమయం. శ్రీరామ నవమి


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా
వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ
భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు
కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .
విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా
వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !
తిరుగులేని మాటకు - రామబాణం
సకల సుఖశాంతులకు - రామరాజ్యం .
ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన
ఆజానుబాహుడి పోలికకు - రాముడు
అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు
రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .
ఆదర్శ దాంపత్యానికి సీతారాములు
గొప్ప కొడుకు - రాముడు
అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు
గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .
మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).
మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).
సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .
రామాయణం పలుకుబళ్లు
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .
తెలుగులో కూడా అంతే .
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది ...
చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం.
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
అదొక పుష్పకవిమానం
కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .
వికారంగా ఉంటే -
శూర్పణఖ
చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).
పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
అంగదుడి అంగలు.
మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర
పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .
ఎంగిలిచేసి పెడితే -
శబరి
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు
అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే .
పితూరీలు చెప్పేవారందరూ -మంథరలే.
సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని
యుద్ధమంటే రామరావణ యుద్ధమే .
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే
ఈ శ్లోకంలో ఉన్న రామ శబ్దాన్ని మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

Tuesday, April 16, 2024

Famous Telugu Quotes || మంచి మాట || Manchi Maata || మంచి మాటలు || సూక్తులు

మన జీవితంలో
 ఆనందం, 
నమ్మకం అనేది 
అమ్మకానికి దొరకవు.
 ఆనందాన్ని 
మనషులతో 
పంచుకోవాలి,
నమ్మకాన్ని 
మనస్సులో  
పెంచుకోవాలి.



స్నేహం ఎలా 
చేయాలో 
నేర్చుకున్న కానీ
 ఎలా
 మరిచిపోవాలో 
నేర్చుకోలేదు 
ఒకవేళ నేర్చుకోక 
తప్పదు 
అంటే ఈ లోకాన్ని 
మరిచిపోతాను కానీ  
మిమ్మల్ని  మీ స్నేహాన్ని 
మరువలేను  నేస్తమా..



Saturday, April 13, 2024

What prevents you from saving money?


Get rid of these habits. And you will feel how the empty pillowcase begins to fill with an elastic airbag.

The habit of spending all your money.

With this approach to finance, there is no money left either with a modest salary or with an indecently large one.

❌ Lack of goal.

You need to save not for a “rainy day”, but for a vacation, renovation, house, etc. – find your motivation.

❌ Live in debt.

Spending more than you earn is a bad financial strategy. Until you learn to live within your means, you cannot begin to accumulate wealth.

❌ Spontaneous purchases.

The financial plan must include not only future income, but also future expenses. Plan your purchases in advance. Spontaneous spending deprives you of the opportunity to invest more and receive passive income.

❌ Neglect of required benefits.

Unused tax deductions, cashbacks, discounts mean thousands and thousands of rubles in lost profit

​How to Face an Interview ?

What aspects would you need to consider for the preparation of the interview, let’s see:

1. First and Foremost is the Research:

Read about the Company for which you are going to be interviewed. Search the website, Social channels like LinkedIn, etc.  Having information about the prospective employer is good for candidates and shows the interest of the candidate about the job and the company. Also, the Job description is the key to prepare for the relevant questions and answers ⁉️ which the interviewer may ask.

2. Dress to Impress and Success:

Follow the Dress Code (if any). Otherwise, the Golden rule is to wear formal clothes. Do not dazzle and Flash. Dress well and always wear a Smile.

3. A Complete set of Documents:

Better to File all relevant documents in chronological order. Keep extra sets of Resume.  Also, bring a notepad and pen to take notes.

4. Time:

Be on time. Reach at least Ten minutes before the start of the interview. Verify the address details one day before the interview and plan your way accordingly. You can use Google Maps too.

5. Body Language:

Look Confident. Confidence will be there if you are prepared and dressed well for the interview. Greet the Interviewer/s when you meet them and have a firm Handshake with a Smile. Don’t lean backward on the Chair. Sit straight. Stay Calm and Avoid Stress. Put your phone on silent or better be switched off before entering the office.

6. Prepare your Questions too:❔

At last, ask your questions or doubts, if any. Asking questions shows your interest in the position for which the interview is being.


End the interview with a "Thank you" to the interviewer.

SPOKEN ENGLISH : Idiom of the Day / Word Of The Day

Idiom of the Day

IN THE SOUP: in deep trouble.
(తీవ్ర ఇబ్బందుల్లో)

For example, "He got into a soup when the teacher caught him using the cell phone.


Word Of The Day: 

Purge (verb): to remove someone who is undesirable from a place or organization.
తొలగించు, ప్రక్షాళన చేయు, కల్మషాన్నీ తొలగించు.

Example: They purged the political party of its disloyal members.

WORDS TO USE INSTEAD OF "VERY"

WORDS TO USE INSTEAD OF "VERY"

Very angry -> Furious
Very cheap -> Stingy
Very clean -> Spotless
Very old -> Ancient
Very short -> Brief
Very tasty -> Delicious
Very hungry -> Starving
Very tired -> Exhausted
Very happy -> Ecstatic

Friday, April 12, 2024

A valuable gadget for TEACHERS

It intensifies the voice and uniformly appropriates it all through the room

On occasion, IT becomes challenging for educators to deal with a class of 60 stu-gouges and ensure their voice contacts those sitting on the last seat. It's not shocking then that their vocal lines get impacted as need might arise to talk over the course of the dayd.
I as of late went over a versatile voice enhancer from Shidu and viewed it as ideal for educators. A basic arrangement intensifies their voice and equally disperses it all through the room.

What is a compact voice enhancer?
As the name proposes, a versatile voice enhancer can amplify one's voice. It seems to be a little Bluetooth speaker that works by interfacing a receiver. Voice intensifiers can be utilized by educators, local escorts, ground staff at air terminals or teachers who need to give their vocal strings a rest.

Conservative and versatile
Generally, I was unable to track down anything to gripe about, and this little gadget feels all around made. It is reduced and lightweight, which makes it ideal for ct for cutting to the rear of your belt or pocket. The lash on the back is helpful to snare to a pack tie or over a handle.

Buttons feel perfect and receptive to inputs, as well. The TF (Miniature SD) card and USB streak drive permits this gadget to help playing media on the gadget. Not exclusively is this gadget a voice ampli-fier, yet it likewise serves as a convenient Bluetooth speaker. The gadget can surely sneak up all of a sudden for its size and remain moderately bending free.

What it resembles to utilize
The enhancer worked extraordinary both inside and outside. With a 10W result, the sound is sufficient to fill a homeroom of 40 understudies however it will get muffled in bigger environ-ments. Pushing as far as possible past 80% will corrupt the result quality.

Charging this gadget is simple however expects between three to five hours to completely charge it. The battery can endure as long as 12 hours on a solitary charge. The wired head-worn mouthpiece is customizable. You can easily change the distance between your mouth and the mic.

Would it be a good idea for you to get it?
For educators, a convenient voice speaker seems OK something I found while survey ing this gadget. Accessible in amazon and other e-com locales.

Wednesday, April 10, 2024

బాల్కనీలో తమలపాకు..


జీర్ణశక్తి మెరుగుపరిచే ఔషధగుణాలున్న తమలపాకును పెరట్లో లేదా బాల్కనీలో పెంచుకోవచ్చు. తగు జాగ్రత్తలు పాటిస్తే పచ్చని తమలపాకు మీకెదురుగా ఉంటుంది. తమలపాకు మొక్కను పెంచుకోవడానికి పెరట్లో చోటులేనప్పుడు బాల్కనీలో తొట్టెలో నాటొచ్చు. రోజంతా ఎండ పడే ప్రాంతంలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం రెండుగంటలపాడు నీరెండ పడేలా ఉంటే ఈ మొక్క ఏపుగా ఎదుగుతుంది. తీవ్రమైన ఎండ వేడిని, పొడి
వాతావరణాన్ని ఇది తట్టుకోలేదు. దీనికి పెద్ద తొట్టెను ఎంచుకోవాలి. లేదంటే ఎరువులుగా కలిసి ఉండేలా చూడాలి. మట్టి గుల్లగా, తొట్టెలో తేమ దూరం కాకుండా జాగ్రత్తపడాలి. రోజూ నీటిని అందించాలి. అలాగని నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. లేదంటే ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. తొట్టె లడుగున రెండు మూడు రంధ్రాలు చేస్తే, అదనపు నీరు బయటకు పోతుంటుంది. తొట్టె మధ్యలో మొక్క పాకడానికి వీలుగా మాస్సిక్ తప్పనిసరి. నాటిన మూడునాలుగు వారాల్లో కొత్తచిగుర్లతో నవనవలాడుతూ గుబురుగా ఎదగడం ప్రారంభమవుతుంది. హైడ్రోజన్ ఎక్కువ శాతం ఉండే ఎరువు ఈ మొక్కకు అవసరం. రసాయన ఎరువుల జోలికి వెళ్లకపోవడం మంచిది. మూడు నెలలకొకసారి ఆవుపేడ, ఆకులు వంటి వాటితో తయారుచేసే సేంద్రియ ఎరువులను అందించాలి. ఆకులపై చేరే చీడపురుగుల బెడద నివారణకు, ఎక్కువ నీటిలో తక్కువ సబ్బునీరు, వేపనూనె కలిపి ఆ మిశ్రమాన్ని చల్లితే చాలు. ఆకులు చెదపట్టినట్లు మారితే వాటిని గిల్లేసి దూరంగా పడేయాలి. అంటు కట్టొచ్చు... మొక్క నుంచి చిగుర్లున్న కొమ్మను కత్తిరించి విడిగా తీయాలి. చిగుర్లను మాత్రం ఉంచి, మిగతా ఆకులను తీసేసి నీటిని నింపిన గాజు గ్లాసులో ఉంచితే వారంలో కొమ్మకు వేర్లు మొదలవుతాయి. దీన్ని విడిగా తొట్టెలో ఉంచితే చాలు. అలాగే వేర్లున్న కణుపుల వద్ద ఒక కొమ్మను కత్తిరించాలి. భూమిలో వేర్లు ఉండేలా కొమ్మను వాలుగా పాతి, నీటిని అందిస్తే చాలు. మూడు నాలుగు వారాల్లో చిగురిస్తుంది. దీన్ని తీసి తొట్టెలో నాటుకోవచ్చు. మొక్క పొడవుగా పెరుగుతున్నప్పుడు చివర్లు కత్తిరించి వాటిని వేరే చోట నాటుతుంటే మొక్క అడుగుభాగాన కొత్త ఆకులు చిగురిస్తాయి.


Long life to those who spend a little time in the day

Experts say that stretching can have a long- lasting effect on muscle strength, so it's okay to do some daily activities

New York: Sitting all day is bad for health, but there are no benefits. Some of today's lifestyle diseases are caused by sitting for hours. Obesity, heart disease, diabetes, back problems, and infertility are all greatly affected by sitting for long periods of time. That's why every Doctors advise to get up and walk for 2-3 minutes every half an hour or once an hour. What is the point of sitting too long? Don't think it's just leg pain. Doctors suggest that you can live longer by sitting for some time in the day. Exercise Physiologist Christopher Travers of Cleveland Clinic Sports Hell in Cleveland, America says this. His suggestion is to sit for at least three hours a day. 'Compared to sitting, standing has a significant effect on our life span. One of the important benefits of this is muscle movement. This strengthens the muscles.
Calories from sugars are dissolved. Insulin sensitivity increases. "It's good for heart health in the long run," says Maylord Howell of Dean's Crash Fit in New York. Their suggestion is to make sitting a habit a habit. If you want to go and drink water yourself, drink tea or coffee, drink if you have to wait somewhere, drink while you are on a phone call or talk while walking around... You can increase the time spent drinking with such actions. Another suggestion is to set up a desk where you can work. It is said that productivity will also increase due to this. That's not all. Regular walking for an hour can improve health.


ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులు Vasant Navratri from Ugadi to Sri Rama Navami

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి అంటే *ఉగాది* నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది.

ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది.
శిశిరంలో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత,
నవ పల్లవాలతో చిగిర్చి,
పూల సోయగాలతో కనువిందులు చేస్తూ ,
సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే,
ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే.

అందుకే… ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు.

అనంతమైన కాలంలో,
కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత?

ఈ వసంతఋతువు లోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం.

అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలూ శ్రీరామ జననంతో మంచిరోజులు వచ్చాయని సంతోషించాయి.

పుడుతూనే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు.

అందుకే, సంవత్సరంలో తొలిపండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ *వసంత నవరాత్రులు* సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది.

అయితే, తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి?
పదిరాత్రులు జరుపుకోకూడదా?
ఏమిటీ లెక్క? అనే సందేహం చాలామందికి కలుగుతుంది.

*నవ* అంటే తొమ్మిది అని, క్రొత్త అని రెండు అర్థాలు ఉన్నాయి.

క్రొత్త అంటే,
అంతవరకూ రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి,
ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం.

ఇక తొమ్మిది రాత్రులు ఎందుకుచేయాలంటే,

భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం

శ్రవణం – కీర్తనం – స్మరణం – పాదసేవనం – అర్చనం – వందనం – దాస్యం – సఖ్యం – ఆత్మనివేదనం.
ఇవి నవవిధ భక్తిమార్గాలు.

భాగవతోత్తములుగా ప్రసిద్ధి గాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తిమార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని,
పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.

నవరాత్రులు తొమ్మిది రోజులు,
ఒక్కొక్క రోజూ,
ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని,
అలా తొమ్మిది రోజులు,
తొమ్మిది భక్తిమార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే,
ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు.
మన ఋషులు.

*వసంత నవరాత్రి మహిమ*

ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|
శరద్వసంత నామానౌ తస్మాత్‌ దేవీం ప్రపూజయేత్‌||

సంవత్సరచక్రంలో,
వసంత,
శరదృతువులు
రెండూ,
ప్రాణులకు రోగకారకమైనవి.

కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ,
ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

అలా మృత్యుముఖంలో పడకుండా,
తప్పించుకోదలచిన వారు,
పరమేశ్వరిని సేవించి,
ఆమె అనుగ్రహాన్ని పొందాలి.

అపమృత్యు వినాశినియై ,
సర్వాపద్లినివారిణియై విరాజిల్లే,
ఆ జగన్మాతను ప్రార్థించిన వారు,
ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని ,

ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజావిధానాన్ని వివరించాడు.

సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రులు అని,

అర్థ సంవత్సరం గడచిన తర్వాత,
శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ,
శరన్నవరాత్రులు అని వ్యవహరింపబడతాయి.

వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం.

రామచంద్రుడు పురుషరూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం.

*శ్రీరామో లలితాంబికా*
అని పురాణాలు వివరిస్తున్నాయి.

నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో నవరాత్రులలో దేవీపూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది.

శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం.

మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి,

తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి,

ప్రశాంతస్థితిని అనుభవించడానికి ,

నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని,
వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు.

వసంత నవరాత్రులలో,
శరన్నవరాత్రులలో,
పరాశక్తిని ఆరాధించి, అభీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.

రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా,

ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిగిన తర్వాత,
దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు.

దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారాణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి,

దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని,
దేవిని ఆరాధించి,
సకల సంపదలనూ పొంది,
దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు.

అజ్ఞాతవాసం ఆరంభించబోతూ,
పాండవులు విరాటనగరంలో ప్రవేశించే ముందు,
జగన్మాతను సేవించి,
నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.

ఈ రోజు బాలేందు వ్రతము Today is Balendu Vratam

ఈ రోజు బాలేందు వ్రతము 

చైత్ర శుక్ల ద్వితీయ రోజున
బాలేందువ్రతాచరణ చేయవలెను.
ఈ వ్రతాచరణము వలన స్త్రీలు
సౌభాగ్యమును మరియు పుత్ర
సంతానమును పొందుదురు. ఈ
రోజున ఉపవాసము చేసి
సాయమౌపానన‌ పిదప
చంద్రదర్శనము చేసుకొని
చంద్రాంతర్యామియైన
అమృతకలశధారీ ధన్వంతరిని
పూజించవలెను. సాయంకాలము
స్నానము చేసి పిండితో
బాలచంద్రుని చేసి ఆ పిష్టములో
చంద్రుని, ఆ చంద్రాంతర్యామి
ధన్వంతరిని ఆవాహన చేసి తెల్ల
పుష్పములతో పూజించి,
నూలుపోగు సమర్పించి,
పరమాన్నమును, నూనెతో
తయారుచేసిన పదార్థములను
నైవేద్యము చేయవలెను. ఈ
ప్రతమువలన రోగరుజినముల
బాధ తప్పుతుంది. బాలేందు
వ్రతము చేయువారు ఒక
సంవత్సరము వరకు నూనెతో
చేయబడిన పదార్థములను
ఆరగించరాదు.

భద్రాచల క్షేత్రం పూర్వం ఎలా ఉండేది? How was Bhadrachalam Kshetra earlier?

భద్రాచల క్షేత్రం పూర్వం ఎలా ఉండేదో వివరిస్తున్న కథనం ఇది. 1934 లో గృహలక్ష్మి పత్రికలో ఇచ్చారు. ఒకసారి ఆసాంతం చదవండి.. -జై శ్రీ రామ్

Sunday, April 7, 2024

1844 నుంచి 2024 వరకు క్రోధి నామ ఉగాది ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? Do you know when 1844 to 2024 Krodhi Nama Ugadi happened?

1964 క్రోధి నామ సంవ్సతరం ఓ పత్రికలో ప్రచురితమైన ఉగాది కవిత.. 1964 Krodhi Nama Samvsataram Ugadi Kavita

ఇది క్రోధి ఉగాది । 
అరవై ఏళ్ళ అనంతరం
 తిరిగి వచ్చిందీ ఏడాది !
అన్నీ కొత్త ముఖాలేనని 
అవలోకిస్తూందీ క్రోథి ! 
బుద్బుద ప్రాయపు 
జీవన ప్రమాణాన్ని గని
అబ్బుర పడుతోందీ క్రోథి !
విశ్వ శాంతిని కాంక్షిస్తా 
నంటోందీ క్రోధి !
క్రోధాలు మాపడానికే వచ్చా 
నంటోందీ క్రోధి !
 సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని
 పెంపొందిస్తా నంటోందీ క్రోధి !
మనందరికీ ఆరోగ్య సౌభాగ్యాలు
 ప్రసాదిస్తా నంటోందీ క్రోధి!
 వేచి చూదాం !
యీ క్రోధి బడాయిలు ! 
ఏటేటా వస్తుంది ఉగాది 
యుగ యుగాల నాటి ఉగాది |1